Sharwanand : వికలాంగుడిగా శర్వానంద్?

Sharwanand : ఇండస్ట్రీలో చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్.. ప్రస్థానం సినిమా శర్వానంద్ కి

Update: 2020-08-31 10:06 GMT

Sharwanand 

Sharwanand : ఇండస్ట్రీలో చాలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్.. ప్రస్థానం సినిమా శర్వానంద్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.. ఆ తర్వాత రన్ రాజా రన్, శతమానంభవతి సినిమాలతో శర్వానంద్ రేంజ్ పెరిగింది. ఇక ఈ ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్.. కానీ ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.. ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమా చేస్తున్నాడు.. పల్లెటూరి నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత కొరియాగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్‌లో మరో తెలుగు, తమిళ భాషలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్..

అంతేకాకుండా ఆర్‌ఎక్స్100 ఫేం డైరెక్టర్ అజయ్ భూపతి దర్మకత్వంలో మహాసముద్రం అనే సినిమాని చేస్తున్నాడు.. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ ప్రకాష్ అనే కొత్త డైరెక్టర్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని, ఇందులో శర్వానంద్ ఓ వికలాంగుడి పాత్రలో నటించనున్నాడని ఫిలిం సర్కిల్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.. ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక అంతకుముందు రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడిగా కనిపించి ప్రేక్షకుల‌ని మెప్పించిన సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News