Sai Dharam Tej 15th Movie : పూర్తిగా మారిన సాయి తేజ్.. కొత్త మూవీ పోస్టర్ చూసారా?

Sai Dharam Tej 15th Movie : రొటీన్ సినిమాలు చేస్తూ అరడజన్ ప్లాపులను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..

Update: 2020-08-14 10:43 GMT
Sai dharam tej 15th movie

Sai Dharam Tej 15th Movie : రొటీన్ సినిమాలు చేస్తూ అరడజన్ ప్లాపులను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత తన పేరును, కథలను మార్చుకొని సినిమాలను చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే సినిమాని చేశాడు, కథ కూడా సాయి తేజ్ కి సరిగా అప్ట్ అవ్వడం కథనంలో కొత్తదనం కనిపించడంతో ప్రేక్షకులు సినిమాని హిట్ మెట్టుని ఎక్కించారు.

ఇక మారతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజూ పండగే సినిమా భారీ హిట్ అయింది.. దీనితో సాయి తేజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం సాయి తేజ్ సుబ్బు దర్శకత్వంలో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్నాడు.. ఇక ఈ సినిమా తరవాత వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తన కొత్త సినిమాని మొదలు పెట్టాడు సాయి. ఇందులో సాయి తేజ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది సాయి ధరమ్ తేజ్ కి 14 వ సినిమా కావడం విశేషం..

ఇక తాజాగా త‌న 15వ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్రక‌ట‌న చేశాడు సాయి ధరమ్ తేజ్.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన కార్తీక్ దండు ద‌ర్శక‌త్వంలో సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సుకుమార్ స్కీన్ ప్లే అందించడం మరో విశేషం.. మిస్టికల్ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా పైన ఆసక్తిని రెకిత్తిస్తుంది...చ‌క్రంలో నుండి ఒంటి క‌న్నుతో ఓ వ్యక్తి ఏదో గ‌మ‌నిస్తున్నట్టు ఉంది. ఇక ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

Tags:    

Similar News