Ram Pothineni: రామ్ పోతినేని కుటుంబంలో విషాదం
Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కుటుంబంలో విషాదం నెలకొంది. రామ్ తాతయ్య మంగళవారం మరణించారు.

హీరో రామ్ తాతయ్య (ఫొటో ట్విట్టర్)
Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కుటుంబంలో విషాదం నెలకొంది. రామ్ తాతయ్య మంగళవారం మరణించారు. ఈ మేరకు ఆయన భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు. కుటుంబం కోసం తాతయ్య ఎంతో కష్టపడ్డారని రామ్ పేర్కొన్నారు. తాతయ్య మరణంతో నా హృదయం ముక్కలైందని, ఎంతో బాధగా ఉందని ఆయన వెల్లడించాడు.
''తాతయ్య.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా తన జీవితాన్ని మొదలుపెట్టాడు. ఉన్నత శిఖరాలకు చేరిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబ సభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించారు. దీని కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రపోయేవారు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి రిచ్‌నెస్ కాలేరని, కేవలం మంచి మనసుతోనే ధనవంతులు అవుతారని మీరే నేర్పించారు. మీ పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం మీరే. కానీ, మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా' అని ట్విట్టర్లో తన తాతయ్యపై ఉన్న ప్రేమను రాసుకొచ్చాడు రామ్.