Hero Aadi New Movie Pan India: ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

Hero Aadi New Movie Pan India: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి ముందు బాహుబలి తరవాత అని చెప్పుకోవచ్చు

Update: 2020-07-10 17:10 GMT
aadi pan india

Hero Aadi New Movie Pan India: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి ముందు బాహుబలి తరవాత అని చెప్పుకోవచ్చు... పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ తర్వాత టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా మూవీలను చేయడానికి ముందుకు వస్తున్నారు. స్వయంగా చిరంజీవి కూడా ఇదే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ హీరో కూడా వెళ్తున్నాడు. అతడే ఆది సాయికుమార్‌.. ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఓ సిరీస్ లాగా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండడం మరో విశేషం.. ఈ చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని ఆది సాయికుమార్ భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ల‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాని ఎస్వీఆర్‌ ప్రోడ‌క్షన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.ఎస్‌‌ ద‌ర్శక‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎస్‌వీఆర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఆది సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్షన్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. త్వరలో ఫస్ట్ పార్ట్ మొదలు కానుంది. సినిమాల పైన మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

  

Tags:    

Similar News