Young Rebel Star Prabhas 20 First Look: రొమాంటిక్ లుక్ లో ప్రభాస్, పూజా

Young Rebel Star Prabhas 20 First Look: రొమాంటిక్ లుక్ లో ప్రభాస్, పూజా
x
Prabhas 20 First Look
Highlights

Young Rebel Star Prabhas 20 First Look: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతోగాను ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.

Young Rebel Star Prabhas 20 First Look: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతోగాను ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రభాస్ 20వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కం టైటిల్ ని రివీల్ చేసింది చిత్రబృందం.. ఈ సినిమాకు ''రాధే శ్యామ్'' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.. ఇక ఫస్ట్ లుక్ లో ప్రభాస్, పూజా హెగ్డే‌తో కలిసి రొమాంటిక్ పోజిస్తూ కనిపిస్తున్న ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

జిల్ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్వ జన్మల ఆధారంగా ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తోంది.

ఇక ప్రభాస్ గత ఏడాది సాహో సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ సినిమాకి మాత్రం బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా అనంతరం వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అమిద్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఒక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి సినిమాతో జాతీయ అవార్డుని సంపాదించుకున్న నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమా తెరకేక్కుతుండగా, సీ అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా షూటింగ్ మొదలు కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories