5 Years of Bahubali: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు..

5 Years of Bahubali: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు..
x
5 Years of Bahubali
Highlights

5 Years of Bahubali: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు..

5 Years of Bahubali: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి ముందు బాహుబలి తరవాత అని చెప్పుకోవచ్చు.. టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు.

జానపద కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నటుల పాత్రల‌తో కూడిన పోస్టర్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాడు రాజ‌మౌళి.. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయి నేటికి అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేంని హాలీవుడ్ తరహాలో తెరకెక్కించాడు రాజమౌళి.. ఇక సినిమా క్లైమాక్స్ లో అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నను అందరిలో మదిలో ఉంచుతూ రెండో పార్ట్ కోసం అందరిని ఎదురు చూసేలా చేశాడు రాజమౌళి. ఇక రెండో పార్ట్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే..

అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాహుబలి మొదటి పార్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీ కోసం..

ఓ నది దాటుతూ ఓ బిడ్డని కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన శివగామి పాత్ర నుంచి ఈ కథకి బీజం పడింది.

♦ ఆ తరువాత కొన్నేళ్ళకు కట్టప్ప పాత్రను క్రియేట్ చేయగా ఈ సినిమాపైన రాజమౌళికి పూర్తి నమ్మకం వచ్చింది.

♦ ఈ కథ మొదటి డ్రాఫ్టుని పూర్తి చేయడానికి రచయితలకు మూడు నెలలు సమయం పట్టింది.

♦ 2013 జులై 6న బాహుబలి షూటింగ్ చాలా గ్రాండ్ గా మొదలైంది.

♦ ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి "కిలికిలి" లేదా "కిలికి" అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు.

♦ ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.

♦ శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. కానీ శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది.

♦ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.

♦ ఈ సినిమాలోని తమ పాత్రలకు అనుగుణంగా ప్రభాస్, అనుష్క, రానాలు కత్తిసాము నేర్చుకోగా, ప్రభాస్, రానాలు అదనంగా గుర్రపుస్వారీలు నేర్చుకోవడం జరిగింది.

♦ మొత్తం 15 విభాగాలలో ఈ సినిమాకి నంది అవార్డులు లభించాయి.

♦ ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 జులై 10న విడుదల చేయగా , సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకి కలెక్షన్ల వర్షం కురిసింది. దాదాపుగా ఫస్ట్ పార్ట్ 600 కోట్లను కొల్లగొట్టింది.

♦ ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిచాడు.

♦ భారతీయ ప్రేక్షకులు మెచ్చిన ఈ సినిమాని చైనీయులు తిప్పి కొట్టారు. అక్కడ ఈ సినిమా ప్లాప్ ను మూటగట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories