Thandel Pre Release Event: తండేల్ ఈవెంట్‌కు హాజరుకాని బన్నీ.. అసలు కారణం చెప్పిన అల్లు అరవింద్

Thandel Pre Release Event: నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్.

Update: 2025-02-03 07:45 GMT

Thandel Pre Release Event: తండేల్ ఈవెంట్‌కు హాజరుకాని బన్నీ.. అసలు కారణం చెప్పిన అల్లు అరవింద్

Thandel Pre Release Event: నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. శ్రీకాకుళంలోని మత్స్యకారుల జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వస్తారంటూ చిత్ర బృందం మొదట ప్రకటించింది. చివరి నిమిషంలో బన్నీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అల్లు అర్జున్ వస్తారని ఎంతో ఆసగా చూసిన ఆయన అభిమానులు నిరాశ చెందారు.

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ వస్తారని మూవీ టీమ్ ప్రచారం చేసింది. గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి.. బన్నీ ఎంట్రీ గురించి ఎవరూ షాక్ అవ్వలేదు. కానీ ఇటీవల కాలంలో బన్నీ కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తండేల్ సినిమా వేడుకలో బన్నీ పాల్గొంటారని చెప్పడంతో.. బన్నీ ఈవెంట్‌లో ఏం మాట్లాడతారా అని అభిమానులు ఎంతో వెయిట్ చేశారు. తీరా బన్నీ ఈవెంట్‌కు హాజరుకాకపోవడంతో బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

బన్నీ ఈవెంట్‌కు హాజరుకాకపోవడంపై అల్లు అరవిండ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లొచ్చారని.. గ్యాస్ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అందుకే రాలేకపోయారని చెప్పారు. అల్లు అర్జున్ స్థానంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. అయితే బన్నీ ఈవెంట్‌కు ఆరోగ్యం బాగోలేక రాలేదా? లేక మరేమైనా కారణామా అనే చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని నిర్మించారు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి అక్కడ కోస్ట్‌గార్డులకు బందీలుగా చిక్కారు. ఇదే కథను ఆధారంగా చేసుకుని తండేల్ సినిమాను తీశారు.

Tags:    

Similar News