Super Star Krishna: ఆస్పత్రిలో ఆ 24 గంటలు..

Super Star Krishna Passes Away Live updates: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యానికి గురైన.. 24 గంటల్లోనే కుటుంబ సభ్యులు, అభిమానులను వదిలి వెళ్లిపోయారు.

Update: 2022-11-15 06:54 GMT

Super Star Krishna: ఆస్పత్రిలో ఆ 24 గంటలు..

Super Star Krishna Passes Away Live updates: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యానికి గురైన.. 24 గంటల్లోనే కుటుంబ సభ్యులు, అభిమానులను వదిలి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో చేరిన ఒక్కరోజులోనే అందర్నీ వీడివెళ్లిపోయారు. కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో జరిగిన పరిణామాలను ఓసారి చూద్దాం..

నిన్న రాత్రి 2 గంటలకు కృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 2 గంటలకు కృష్ణను హాస్పిటల్‎కు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు చేశారు. అతనికి గుండెపోటు వచ్చిందని కార్డియాక్ అరెస్ట్‎కు గురయ్యారని గుర్తించారు. వెంటనే 20 నిమిషాలపాటు సీపీఆర్ చేశారు. ఆ తర్వాత కృష్ణను ఐసీయూకు తరలించి చికిత్స కొనసాగించారు.

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం పాలయ్యారనే వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించారు. కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంలోనూ అతని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమమైంది. కృష్ణ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు అభిమానులు ఆకాంక్షించారు.

నిన్న మధ్యాహ్నం ఒంటిగంట 5 నిమిషాల సమయంలో కాంటినెటల్ వైద్యులు కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కృష్ణను అనారోగ్యంతో ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. కృష్ణ కార్డియాక్ అరెస్ట్‎కు గురయ్యారని ప్రకటించారు. 24 గంటల నుంచి 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. కృష్ణ ఆరోగ్యానికి సంబంధించి ప్రతీ గంటా కీలకమేనని వైద్యులు చెప్పారు.

నిన్న సాయంత్రం 6 గంటల20 నిమిషాలకు కాంటినెంటల్ వైద్యులు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కృష్ణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ప్రకటించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‎గా ప్రకటించారు.

ఇవాళ ఉదయం కృష్ణ మరణవార్త కుటుంబ సభ్యులు, అభిమానులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారనే వార్త సినీలోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. తెల్లవారుజామున కృష్ణ 4 గంటల 9 నిమిషాలకు కన్నుమూశారని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు. కృష్ణ శరీరం వైద్యానికి సహకరించలేదని చెప్పా్రు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ శరీరాన్ని గాయపరచి వైద్యం చేసేందుకు ప్రయత్నించలేదని కాంటినెంటల్ వైద్యులు చెప్పారు.

Full View


Tags:    

Similar News