Happy Birthday Suriya: 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండే సూర్య డైట్, వర్కౌట్, లైఫ్‌స్టైల్ సీక్రెట్స్
నటుడు సూర్య 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫిట్‌నెస్ రహస్యాలు, డైట్ ప్లాన్, వర్కౌట్ రొటీన్, 'కంగువ' ట్రాన్స్‌ఫర్మేషన్ విశేషాలు తెలుసుకోండి. ఈ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఎంతో మందికి స్ఫూర్తి.
Happy Birthday Suriya: Fitness, Diet & Lifestyle Secrets of the Actor at 50!
హ్యాపీ బర్త్‌డే సూర్య: 50ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్‌కి రహస్యం ఇదే!
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సూర్య (Suriya) ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు పెరిగినా, ఆయన ఫిట్‌నెస్, యాక్టివ్‌నెస్, స్లిమ్ బాడీ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సందర్భంగా సూర్య డైట్, వర్కౌట్, ఫిట్‌నెస్ రొటీన్ గురించి తెలుసుకుందాం.
‘కంగువ’ కోసం 100 రోజుల కఠినమైన ట్రాన్స్‌ఫర్మేషన్
- ఇటీవల మే 5న ‘మన స్టార్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సూర్య 'కంగువ' సినిమాలో భారీ యుద్ధ సన్నివేశం కోసం 100 రోజుల ట్రైనింగ్ చేసుకున్నట్లు వెల్లడించారు.
- ఆయన చెప్పినట్టు, “30 ఏళ్ల వయసులో అది డౌన్‌హిల్ రన్నింగ్‌లా అనిపించేది. కానీ ఇప్పుడు 49ఏళ్ల వయసులో అది మౌంటెన్ క్లైంబింగ్ లా ఉంది”.
- ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో వ్యాయామం మాత్రమే కాదు, జీవనశైలి మార్పు, క్రమశిక్షణ కీలకం అయ్యాయని ఆయన చెప్పారు.
సూర్య డైట్ & ఫిట్‌నెస్ రొటీన్ – రహస్యాలు ఇవే
- క్యాలరీ డెఫిసిట్ డైట్, హై ఇంటెన్సిటీ కార్డియో, స్ట్రిక్ట్ డైలీ షెడ్యూల్ ఆయన ఫిట్‌నెస్ రహస్యాలు.
- "100 రోజుల ప్రణాళికతో సిక్స్ ప్యాక్ సాధించాను. ఇది పూర్తిగా నేచురల్ మెథడ్," అని సూర్య వివరించారు.
- ఆహార నియంత్రణలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే, తాను ఫుడీ (foodie) అని కూడా చెబుతారు.
10 ఏళ్ల తర్వాత సిక్స్ ప్యాక్ – పట్టుదలతో సాధించిన విజయం
- సూర్య తల్లిదండ్రుల నుంచి తక్కువ బరువు వచ్చే శరీర ధర్మం వచ్చినా కూడా, సిక్స్ ప్యాక్ కోసం తీవ్రంగా కష్టపడ్డారు.
- "ఈ ఫిజిక్ సాధించేందుకు ఎంతో డిసిప్లిన్, డెడికేషన్ అవసరమయ్యింది" అని సూర్య చెప్పారు.
సూర్య గురించి తెలుసుకోండి
- పూర్తి పేరు: శరవణన్ శివకుమార్
- సినీ రంగంలో తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు.
- అత్యధిక పారితోషికం పొందుతున్న దక్షిణాది నటుల్లో ఒకరు.
- నటుడిగా మాత్రమే కాకుండా, సినీ నిర్మాత, సామాజిక కార్యకర్తగానూ పేరు పొందారు.
- భారతదేశంలో most talented, disciplined actorsలో ఒకరుగా గుర్తింపు పొందారు.