Hansika:పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక: విడాకుల రూమర్స్‌కు బలం

Hansika: సినిమా నటి హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా ఆమె భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2025-08-05 08:45 GMT

Hansika: సినిమా నటి హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా ఆమె భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హన్సిక తన సోషల్ మీడియా ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను తొలగించడం, ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

ప్రేమకథ నుంచి పెళ్లి వరకు... ఇప్పుడు విభేదాల చర్చ

2022 డిసెంబర్‌లో హన్సిక తన స్నేహితుడు సోహైల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహ వేడుకలను ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌గానూ ప్రేక్షకులకు అందించారు. మొదట్లో వీరి మధుర సంబధం సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. కానీ తాజాగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, సంబంధం చిగురించలేదని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోహైల్ స్పందిస్తూ విడాకుల వార్తలను ఖండించారు. కానీ హన్సిక మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా మౌనం పాటించడం, ఇప్పుడు పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం.. ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి.

‘శ్రీ గాంధారి’లో భయపెట్టేందుకు రెడీ

ఇదిలా ఉంటే, హన్సిక కెరీర్ పరంగా మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. ఇటీవల 'గార్డియన్‌' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఆమె, ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'శ్రీ గాంధారి'తో రాబోతున్నారు. దర్శకుడు ఆర్‌.కన్నన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హిందూ ట్రస్ట్‌ కమిటీ హెడ్‌ ఆఫీసర్గా హన్సిక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాలో శతాబ్దాల క్రితం నిర్మితమైన గంధర్వ కోటలో అడుగుపెట్టిన ఆఫీసర్, అక్కడ దాగిన మిస్టరీలను ఎలా ఛేదించిందనేది కథాంశం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది.

Tags:    

Similar News