Adivi Sesh: వామ్మో.. గూఢచారి సీక్వెల్ బడ్జెట్ అన్ని కోట్లా.?
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గూఢచారి 2 చిత్రాన్ని ఏకంగా రూ. 100 కోట్లతో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది
Adivi Sesh: వామ్మో.. గూఢచారి సీక్వెల్ బడ్జెట్ అన్ని కోట్లా.?
అడివిశేషు హీరోగా వచ్చిన గూఢచారి మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదల వరకు పెద్దగా హైప్ లేని ఈ చిత్రం థియేటర్లలో మాత్రం చేసిన సందడి అంతా ఇంత కాదు. శోభితా, అడివి శేషు జంటగా 2018లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్‌ను అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌కు సంబంధించి మేకర్స్ చిన్న హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వెంటనే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
కాగా ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తర్వాత గూఢచారి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ సైతం ప్రారంభమైన విషయం తెలిసిందే. గూఢచారి 1 చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన వినయ్ కుమార్ సీక్వెల చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఫస్ట్ పార్ట్ ఊహించని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్2పై పడింది. గూఢచారి2ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్‌ను మించి ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్ విషయంలో చిత్ర యూనిట్ అస్సలు తగ్గట్లేదు.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గూఢచారి 2 చిత్రాన్ని ఏకంగా రూ. 100 కోట్లతో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇమ్రాన్ ఇమేజ్ పాన్‌ఇండియా మార్కెట్‌కి కలిసొస్తుందని చిత్రయూనిట్ విశ్వసిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి గూఢచారి 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.