Good wife review: OTTలో అదరగొడుతున్న గుడ్ వైఫ్..సెక్స్ వీడియో కేసులో భర్త..లాయర్‌గా భార్య చేసిందేంటి?
Good Wife OTT: ఓటీటీలో ఇప్పటికే భామాకలాపం సీరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియమణి ఇప్పుడు తాజాగా గుడ్ వైఫ్‌తో ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటోంది.
Good Wife OTT: OTTలో అదరగొడుతున్న గుడ్ వైఫ్..సెక్స్ వీడియో కేసులో భర్త..లాయర్‌గా భార్య చేసిందేంటి?
Good Wife OTT: ఓటీటీలో ఇప్పటికే భామాకలాపం సీరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియమణి ఇప్పుడు తాజాగా గుడ్ వైఫ్‌తో ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటోంది. జులై 4 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, ప్రియమణి తన నటనతో అదరగొడుతుందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటి రేవతి ఈ సీరీస్‌ను అమెరికా షో ఆధారంగా చేసుకుని నిర్మించారు. భర్త ఒక సెక్స్ వీడియోలో బుక్ అవ్వడంతో భార్య లాయర్‌గా ఎలా కథను మలుపు తిప్పుతనేది ఈ సీరీస్ సారాంశం.
గుడ్ వైఫ్.. పేరుతో జియో హాట్ స్టార్‌లో మొదలైన సిరీస్ అద్బుతంగా ఉందనే టాక్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళి, మరాఠి భాషల్లో ఇప్పుడు ఈ సీరీస్ అందుబాటులో ఉంది. అమెరికన్ షో ఆధారంగా సీనియర్ నటి రేవతి ఈ సీరీస్‌ను డైరెక్ట్ చేశారు. కానీ ఈ సీరీస్‌లో చాలా మార్పులు ఉన్నాయి. ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు చిత్ర నిర్మాణం చేశారు. భర్తగా సంపత్ రాజ్ నటించగా, భార్యగా ప్రియమణి నటించింది. భర్త ఒక సెక్స్ వీడియో కేసులో చిక్కుకుని జైలుకి వెళతాడు.
పోలీసులు అతని ఆస్తులను స్వాదీనం చేసుకుంటారు. అతని భార్య ప్రియమణి ఒక చిన్న ఇంట్లో ఉండి, లాయర్‌గా ఒక ఫారమ్‌లో పనిచేస్తుంది. అయితే ఇల్లు, కోర్టు, జైలు ఇలా వీటన్నింటినీ మ్యానేజ్ చేస్తూ భర్తను ఆ కేసు నుండి బయటకు ఎలా తీసుకొస్తుందనేది ఈ సీరీస్ సారాంశం. ఇందులో ప్రియమణి అద్బుతంగా నటించింది.