"గాడ్ ఫాదర్" ను తక్కువ రేట్లకు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు

Godfather: చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ "ఖైదీ నెంబర్ 150" సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2022-09-26 11:27 GMT

"గాడ్ ఫాదర్" ను తక్కువ రేట్లకు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు

Godfather: చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ "ఖైదీ నెంబర్ 150" సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రీ ఎంట్రీ తర్వాత చిరు సినిమాలు అంతగా హిట్ అవ్వడం లేదు. ఈ మధ్యనే కొరటాల శివ డైరెక్షన్లో "ఆచార్య" సినిమా చిరు కెరీర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు అసలు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. సత్యదేవ్, నయనతార మరియు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

అక్టోబర్ 5 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. కానీ ఈ సినిమాని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. దీంతో నిర్మాతలే ఈ సినిమాని స్వయంగా విడుదల చేస్తారేమో అనుకుంటుంటే, అలా కాకుండా తక్కువ రేట్లకు సినిమాను అమ్మడానికి సిద్ధమయ్యారు దర్శక నిర్మాతలు. నైజాం ఏరియా లో ఏషియన్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాను కేవలం 25 కోట్ల కు కొనుగోలు చేశారు. ఆంధ్ర సీడెడ్ ప్రాంతాలలో నిర్మాతలు స్వయంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News