Ghaati Movie: అనుష్క ఇలా ఎందుకు..? ప్రమోషన్లకు దూరంగా ఉండడం టాక్ ఆఫ్ ది టౌన్!
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత చివరకు సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. అయితే సినిమా రిలీజ్‌కు ఇంకో పది రోజులు మాత్రమే ఉండగా, అనుష్క ప్రమోషన్లకు దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాకు ఇప్పటివరకు పెద్దగా ప్రచారం జరగలేదు. కేవలం ట్రైలర్‌ను రిలీజ్ చేయడం తప్ప, ఎలాంటి ఈవెంట్ లేదా గ్లింప్స్ లాంచ్ చేయలేదు. సాధారణంగా ఈ రోజుల్లో చిన్న అప్డేట్‌కే భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తుంటే, ఘాటి ట్రైలర్‌కు కూడా ప్రమోషన్ లేకపోవడం చర్చనీయాంశమైంది.
ఇంకా ఇంటర్వ్యూలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు ఏవీ ప్లాన్ చేయకపోవడం వల్ల ట్రేడ్ సర్కిల్స్ ఆందోళన చెందుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రిస్క్ పెట్టిన నిర్మాతలు కలెక్షన్ల కోసం ప్రమోషన్లను బలంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ అనుష్క మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
అదే రోజున తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌కి రానున్నాయి. ఇంతటి పోటీ మధ్య ఘాటికి బలమైన ఓపెనింగ్స్ రావాలంటే ప్రమోషన్లు తప్పనిసరి. ఒకవేళ ఇలా కొనసాగితే ఈ సినిమా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ అనుష్క రాబోయే ప్రాజెక్టులపై కూడా పడవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.