OTT Movie: కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలిసినా ప్రేమించే ప్రియురాలు.. గుండెను పిండేసే అద్భుత ప్రేమ కావ్యం

OTT Movie: ప్రేమ కథలు మనసును స్పృశిస్తాయి. మరికొన్ని కథలు మన హృదయాలను పిండేస్తాయి. అలాంటి ఒక సున్నితమైన, గుండెను తాకే సినిమా "ఫైవ్ ఫీట్ అపార్ట్".

Update: 2025-02-04 07:12 GMT

OTT Movie: కొద్ది రోజుల్లో చనిపోతాడని తెలిసినా ప్రేమించే ప్రియురాలు.. గుండెను పిండేసే అద్భుత ప్రేమ కావ్యం

OTT Movie: ప్రేమ కథలు మనసును స్పృశిస్తాయి. మరికొన్ని కథలు మన హృదయాలను పిండేస్తాయి. అలాంటి ఒక సున్నితమైన, గుండెను తాకే సినిమా "ఫైవ్ ఫీట్ అపార్ట్". అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ప్రేమ, బాధ, జీవితం, త్యాగం గురించి చక్కటి అర్థాన్ని తెలియజేస్తుంది. అలాంటి కథలున్న సినిమాలను చూస్తే ఎంతటి వాళ్ళయినా కంటతడి పెడుతుంటారు. ఆ కన్నీళ్ళతో హృదయం కరిగిపోతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. తెలుగులో ‘గీతాంజలి’ మూవీ ఒకప్పుడు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ మూవీ కూడా అలాంటిదే.

‘ఫైవ్ ఫీట్ అపార్ట్‘ (Five Feet Apart) మూవీకి జస్టిన్ బాల్డో దర్శకత్వం వహించారు. సిస్టిక్ ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న వారు ఒకరికొకరు ఆరు అడుగుల దూరంలో ఉండవలసి వచ్చినప్పటికీ ప్రేమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మూవీని హాలీవుడ్‌లో లయన్స్‌ గేట్ అనే ప్రొడక్షన్ హౌజ్ నిర్మించింది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటూన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 92 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కథలో హీరోయిన్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఆమెకు సిస్టిక్ ఫైబ్రోసిస్‌ అనే జబ్బు ఉంటుంది. ఊపిరితిత్తులు మారిస్తే తప్ప బతికే అవకాశం ఉండదు.

అదే హాస్పిటల్లో సేమ్ జబ్బు ఉన్న పో అనే వ్యక్తి కూడా ఉంటాడు. అయితే ఇటువంటి జబ్బు ఉన్న ఇద్దరు వ్యక్తులు సమీపంలో కూర్చోకూడదు. ఐదడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ దూరం మెయింటైన్ చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉంది.

ఈ క్రమంలోనే హీరో అదే జబ్బుతో అదే ఆస్పత్రిలో జాయిన్ అవుతాడు. దూరంగా ఉంటూనే ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. హీరోయిన్‌కి ఊపిరితిత్తులు మారిస్తే బతికే అవకాశం ఉంటుంది. అయితే హీరోకి ఆ అవకాశం ఉండదు. దీంతో తను కొద్ది రోజుల్లో చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. బొమ్మలు వేస్తూ హీరోయిన్‌తో ఎక్కువగా క్లోజ్ అవుతాడు హీరో. అందులో ఉండే పో అనే వ్యక్తి కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడే ఉండిపోతాడు. హీరో, హీరోయిన్లు దూరం పాటిస్తూ ఒకరినొకరు ఇష్టపడుతుంటారు.

ఒకరోజు పో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. కొద్దిరోజుల్లో చనిపోయే తనని చూడాలని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. వాళ్లతో కలిసి ఉంటే కొద్ది రోజులైనా వాళ్లతో సంతోషంగా ఉండొచ్చు అని ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటాడు. ఇది చూసి హీరోయిన్ గుండెలు పగిలేలా ఏడ్చేస్తుంది. ఇంతలోనే హీరోయిన్‌కి లంగ్స్ డొనేట్ చేసే వాళ్ళు వస్తారు. చివరికి హీరోయిన్‌కి ఆపరేషన్ జరుగుతుందా? వీళ్ళిద్దరి ప్రేమ ఏమవుతుంది? హీరో ఈ జబ్బుతో చనిపోతాడా? తెలుసుకోవాలంటే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకూడదు.

Tags:    

Similar News