Fish Venkat: తెలుగు కమెడియన్‌కు సీరియస్.. వెంటిలేటర్‌‌పై చికిత్స

Fish Venkat: తెలుగు సినిమాల్లో కామెడీ విలన్‌గా నటించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం సీరియస్‌గా ఉంది.

Update: 2025-07-02 13:28 GMT

Fish Venkat: తెలుగు కమెడియన్‌కు సీరియస్.. వెంటిలేటర్‌‌పై చికిత్స

Fish Venkat: తెలుగు సినిమాల్లో కామెడీ విలన్‌గా నటించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. తెలంగాణ యాసలో ముద్ద ముద్దగా మాట్లాడుతూ అందరినీ అలరించిన వెంకట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హాస్పిటల్‌లో ఉన్నారు. వెంటిలేటర్‌‌పై చికిత్స పొందుతున్నారు.

ఫిష్ వెంకట్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీల సమస్య ఉంది. దీంతో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గతంతో రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం బావున్నా.. మళ్లీ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. రెగ్యులర్‌‌గా డయాలసిస్‌ జరగాల్సి ఉంది. కానీ ఆర్ధిక కారణాల వల్ల తొమ్మిది నెలల క్రితం చేయించుకున్న డయాలసిస్ మళ్లీ ఇప్పటివరకు చేయించుకోలేకపోయారు. కొన్ని రోజుల నుంచి ఆయన పరిస్థితి మరికాస్త సీరియస్‌గా ఉంది. ఇప్పుడు ఎవర్నీ ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి.

రెండున్నర దశాభ్దాల పాటు కామెడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఫిష్ వెంకట్ అలరించారు. ఖుషి, ఆది, దిల్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. తన దైన శైలిలో తెలంగాణ భాషలో ముద్ద ముద్దగా మాట్లాడుతూ కామెడీ చేసేవారు. పెద్ద విలన్ల పక్కన ఉండి కామెడీ చేయడం వల్ల అందరినీ ఆయన బాగా ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు కారణంగా మెరుగైన చికిత్సను చేయించుకోలేకపోతున్నారు. దీంతో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తమన ఆదుకోవాలని, వెంకట్‌కు చికిత్స్ జరిగేందుకు సాయం చేయాలని వెంకట్ భార్య, కూతురు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News