ఫైనల్ గా ప్రభాస్ తో సినిమా చేస్తున్న తమన్

* ఈ సినిమా సంగీతం కోసం తమన్ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం

Update: 2022-10-29 08:28 GMT

ఫైనల్ గా ప్రభాస్ తో సినిమా చేస్తున్న తమన్

Director Maruthi: ఎప్పుడో "సాహో" సమయం నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ప్రభాస్ తో సినిమా చేయాల్సింది. కానీ అది వర్కౌట్ అవటం లేదు. "సాహో" టీజర్ కి తమన్ సంగీతం అందించారు కానీ సినిమాకి మాత్రం జిబ్రాన్ ను సంగీతం కోసం ఎంపిక చేశారు. "రాధే శ్యామ్" విషయంలో కూడా దాదాపు అదే జరిగింది. తమన్ రాధే శ్యామ్ సినిమాకి కేవలం నేపథ్య సంగీతాన్ని మాత్రమే అందించారు. అయితే భాగమతి సినిమాకి తమన్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ అయింది.

అప్పటినుంచి తమన్ మరియు యువి క్రియేషన్స్ ఎప్పటినుంచో కలిసి పని చేయాలని అనుకుంటున్నారు. ఇన్నాళ్లకు మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కి తమన్ పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మారుతి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా "రాజా డీలక్స్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీతం కోసం తమన్ ను ఎంపిక చేసినట్లుగా సమాచారం.

అయితే ఈ సినిమా కోసం విభిన్న సంగీత వాయిద్యాలను వాడబోతున్నట్లు తెలుస్తోంది."భీమ్లా నాయక్" సినిమాకి చేసిన విధంగానే ఎలాంటి కంప్యూటర్ జనరేటెడ్ ఆడియో లేకుండా ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నారట. ఒడిస్సా మరియు ఇతర రాష్ట్రాలలో వాడే సంగీత వాయిద్యాల నుండి వచ్చే సౌండ్స్ ఆధారంగా తమన్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించనున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి అని చెప్పవచ్చు.

Tags:    

Similar News