Film Federation: వేతనాల పెంపు కోసం పోరాటం.. దోపిడీ మా లక్ష్యం కాదు!

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌కు సంబంధించి కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు.

Update: 2025-08-05 14:16 GMT

Film Federation: వేతనాల పెంపు కోసం పోరాటం.. దోపిడీ మా లక్ష్యం కాదు!

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌కు సంబంధించి కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు లేబర్ కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ,

“కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే మేం కోరుతున్నాం. దోపిడీ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. సినిమా రంగం బాగుంటేనే అందరికీ లాభం ఉంటుంది. అందుకే ఎవరికీ ఇబ్బంది కలగకుండా, 30% వేతన పెంపుతో ముందుకు సాగాలని భావిస్తున్నాం” అని తెలిపారు.

లేబర్ కమిషన్ సూచించిన పరిమిత వృద్ధిని ఫెడరేషన్ తిరస్కరించింది. 2022లో వేతనాలు సవరించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏవీ మారలేదని, ఒప్పంద ప్రకారం మూడేళ్ల తర్వాత వేతన పెంపు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో, వేతన పెంపును అంగీకరించిన నిర్మాతల షూటింగ్‌లకే కార్మికులు హాజరవుతామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. మరోవైపు, యూనియన్‌లకు చెందని కార్మికులను నియమించుకునేందుకు కొన్ని నిర్మాతలు ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. అయితే దరఖాస్తుల భారం వల్ల ఆ వెబ్‌సైట్ తాత్కాలికంగా క్రాష్ అయినట్లు సమాచారం.

రేపు జరగబోయే చర్చల అనంతరం ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇద్దరు వర్గాల మధ్య సామరస్యంతో పరిష్కారం జరిగితే, షూటింగ్‌లు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News