చిత్రపురి ప్రాజెక్ట్‌పై మాదాల రవి స్పందన.. పారదర్శకంగా ముందుకు..
చిత్రపురి కాలనీలో ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టు పై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు కొనసాగుతున్నాయి.
చిత్రపురి ప్రాజెక్ట్‌పై మాదాల రవి స్పందన.. పారదర్శకంగా ముందుకు..
చిత్రపురి కాలనీలో ప్రారంభించబోయే కొత్త ప్రాజెక్టు పై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ, "చిత్రపురి కొత్త ప్రాజెక్ట్ ద్వారా చిత్రపురిలోని 9,000 మంది సభ్యులు, ముఖ్యంగా 4,500 కార్మికులకు మేలు జరగాలని తాము కోరుకుంటున్నామని" తెలిపారు.
మాదాల రవి వివరిస్తూ, "ఈ ప్రాజెక్టు విషయంలో ఫిలిం ఛాంబర్ లోని పెద్దలు, ఇండస్ట్రీ ప్రముఖులు ఒకే తాటిపైకి వచ్చి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రపురి కాలనీపై వివిధ మీడియా వేదికల్లో వివాదాలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఉన్న కమిటీ ఈ ప్రాజెక్టును ఆదర్శవంతంగా, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా కార్మికుల భవిష్యత్తు మెరుగవ్వాలని కోరుకుంటున్నాము" అన్నారు.
చిత్రపురి కాలనీ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని అన్ని విభాగాలను కలిపే ప్రత్యేక గృహ నిర్మాణ కాలనీగా పేరుగాంచింది. ఫిలిం ఛాంబర్ వారు ఫిలిం ఇండస్ట్రీలోని అన్ని విభాగాలను ఆహ్వానించారని, అందుకే తమ సందేశాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారికీ తగిన న్యాయం జరగాలని, అందరూ ఆనందంగా, కలిసిమెలిసి జీవించాలనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు.