Pawan Kalyan: మహారాష్ట్రలో #OG షూటింగ్.. పవన్ కు జనసైనికులు షాకింగ్ సర్ ప్రైజ్
Pawan Kalyan: #OG వర్కింగ్ టైటిల్ పై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సుజిత్ పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నాడు.
Pawan Kalyan: మహారాష్ట్రలో #OG షూటింగ్.. పవన్ కు జనసైనికులు షాకింగ్ సర్ ప్రైజ్
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్ లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సాహో చిత్రం ఫేం సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. #OG వర్కింగ్ టైటిల్ పై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సుజిత్ పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్రలో జరుగుతోంది.
మహారాష్ట్రలోని వాయ్ సరస్సు వద్ద పవన్ షూటింగ్ జరుపుకుంటుండగా అక్కడకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసైనికులు వెళ్లారు. అక్కడే వాయ్ లేక్ వద్ద చిన్న పడవలో జనసేన జెండాని జనసేనానికి చూపించారు. జనసేన జెండాను తదేకంగా వీక్షిస్తున్న పవన్ ను #OG టీమ్ వెనుక నుంచి క్లిక్ మనిపించింది. ఈ ఫోటోను పవన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి మహారాష్ట్రలోని వాయి సరస్సు వద్ద #OG షూటింగ్ చేస్తుండగా, తన సైనికులు వచ్చారని..రాజమండ్రి, కోవూరకు చెందిన సింగిరి సాయి, సింగిరి రాజేష్, సన్నీజాన్ లను కలిశానంటూ పవన్ ట్వీట్ చేశారు.
పవన్ అప్ లోడ్ చేసిన ఫోటోను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో పవన్ జపనీస్ కరాటే కాస్ట్యూమ్ లో కనిపించారు. దీంతో పవన్ కల్యాణ్ రోల్ ఒక రేంజ్ లో ఉంటుందని, ఆ పాత్ర ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయంటూ ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. మొత్తంగా, చాలా కాలం తర్వాత పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండడంతో #OGపై పవన్ ఫ్యాన్స్ కే కాకుండా అందరికి ఆసక్తిగా ఉంది.