Puneeth Rajkumar: కర్ణాటకలో హై అలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం
Puneeth Rajkumar: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందారు.
Puneeth Rajkumar: కర్ణాటకలో హై అలర్ట్.. థియేటర్లు మూసివేయాలని ఆదేశం
Puneeth Rajkumar: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. జిమ్ చేస్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.