Kiran Abbavaram: అలాంటి పనులు ఆపేయమని కిరణ్ అబ్బవరంకి చెబుతున్న అభిమానులు
Kiran Abbavaram: ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే వంటి సూపర్ హిట్ సినిమాలుతో యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు.
Kiran Abbavaram: అలాంటి పనులు ఆపేయమని కిరణ్ అబ్బవరంకి చెబుతున్న అభిమానులు
Kiran Abbavaram: ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే వంటి సూపర్ హిట్ సినిమాలుతో యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరంపై ఆఫర్ల వర్షం కురుస్తోందని చెప్పుకోవాలి. ఈ ఒక్క సంవత్సరంలోనే సెబాస్టియన్ మరియు సమ్మతమే అని రెండు సినిమాలను విడుదల చేసిన కిరణ్ అబ్బవరం త్వరలోనే మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కిరణ్ అబ్బవరం ఇప్పుడు నేను మీకు బాగా కావలసిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, రూల్స్ రంజన్ మరియు మీటర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తాలూకు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ఇప్పుడు వరుస విడుదలతో బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలలో కిరణ్ వద్ద చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి దానివల్ల ఉపయోగాలు గురించి అర్థం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు పెయిడ్ ర్యాలీలు మరియు ఈవెంట్లు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ డబ్బులు ఇచ్చి ఇలా ప్రమోషన్లు చేయడం ఏమాత్రం బాగోలేదని ఇలాంటి పనులు మానేయమని అభిమానులు చెబుతున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని దానికోసం పెయిడ్ ప్రమోషన్లు చేస్తూ సినిమాకి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు.