Erra Cheera: హర్రర్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఎర్రచీర - ది బిగినింగ్' అక్టోబర్ 10న విడుదల

Erra Cheera: బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్".

Update: 2025-09-24 10:41 GMT

Erra Cheera: బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో నటించారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఇందులో నటించారు.

సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5న విజయవాడలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సినిమా బిజినెస్ షో చూసిన డిస్ట్రిబ్యూటర్లు కంటెంట్ బాగుందని ప్రశంసించారు. డివోషనల్ టచ్ ఉన్న కథ కావడంతో సినిమాపై నమ్మకంతో ముందుకు వచ్చారు. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, సినిమా ఆలస్యం కావచ్చని, కానీ కంటెంట్ ఖతర్నాక్‌గా ఉంటుందని అన్నారు. ఇది కుటుంబంతో కలిసి చూసే సినిమా అని, ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వచ్చి చూడాలని కోరారు.

ప్రమోషన్స్‌లో భాగంగా, సుమన్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు జ్యోతి కృష్ణకు చూపించారు. జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 10న థియేటర్లలో తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు.

Tags:    

Similar News