Erracheera: A సర్టిఫికెట్ తో వస్తున్న 'ఎర్రచీర
Erracheera: హారర్, యాక్షన్ అంశాలతో, బలమైన మదర్ సెంటిమెంట్‌ను జోడించి తెరకెక్కిన చిత్రం "ఎర్రచీర" విడుదల సిద్ధమైంది.
Erracheera: హారర్, యాక్షన్ అంశాలతో, బలమైన మదర్ సెంటిమెంట్‌ను జోడించి తెరకెక్కిన చిత్రం "ఎర్రచీర" విడుదల సిద్ధమైంది. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు, ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
సినిమాలోని భయానక సన్నివేశాల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు ప్రత్యేకంగా మాట్లాడుతూ, "గుండె జబ్బులు ఉన్నవారు (Heart Patients) ఈ సినిమాను చూడటానికి వస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలి," అని హెచ్చరించారు.
నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.వి. సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ, "మా కంటెంట్ డివోషనల్ టచ్‌తో ఉంటుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి," అని తెలిపారు.