Drishyam 3: గతం ఎప్పటికీ నిశ్శబ్ధంగా ఉండదు.. దృశ్యం3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Drishyam 3: నరాలు తెగే ఉత్కంఠ.. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి. సినిమా మొదటి నుంచి చివరి వరకు అదే సస్పెన్స్.
Drishyam 3: గతం ఎప్పటికీ నిశ్శబ్ధంగా ఉండదు.. దృశ్యం3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Drishyam 3: నరాలు తెగే ఉత్కంఠ.. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి. సినిమా మొదటి నుంచి చివరి వరకు అదే సస్పెన్స్. ఇదంతా దృశ్యం సినిమా గురించి. భాషతో సంబంధం లేకుండా ఓ సినిమా అన్ని భాషల్లో రీమేక్ అయి విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. అయితే దృశ్యం మూవీ మాత్రం విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఆయా భాషల్లో సీనియర్ హీరోలతో రీమేక్ చేసిన ఈ సినిమాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే దృశ్యం సిరీస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ 2013లో వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో ఈ సినిమాను తెరకెక్కించగా ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దృశ్యం మూవీకి మరో సీక్వెల్ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. మోహన్‌లాల్ నటన, జీతూ జోసెఫ్ టేకింగ్, ట్విస్టింగ్‌కు ఫిదా అయిన ప్రేక్షకులను మరో పార్ట్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ పూర్తి అయినందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రకటించిన మోహన్‌లాల్ ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. ‘దృశ్యం3’ రాబోతోంది’ అని తెలిపారు. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు వెర్షన్‌లో వెంకటేష్, మీనా ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి దృశ్యం 3 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ చేస్తుంది.? ఈసారైనా రాంబాబు పోలీసులకు చిక్కుతాడా.? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.