ఆఫీషియల్ : తెరపైకి దృశ్యం 2
వెండితెర పైన దృశ్యం సినిమా ఎంతమంచి విజయాన్ని అందుకుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.
వెండితెర పైన దృశ్యం సినిమా ఎంతమంచి విజయాన్ని అందుకుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ చిత్రాన్ని ముందుగా మలయాళంలో తెరకెక్కించారు. అక్కడ ఈ చిత్రం రూ .75 కోట్లను కొల్లగొట్టింది.. ఆ తర్వాత మిగతా బాషలలో రీమేక్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్, మీనా కలిసి నటించారు.
అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్.. ఈ విషయాన్ని జీతూ జోసెఫ్ స్వయంగా ప్రకటించారు. దృశ్యం సినిమాలో నటించిన మోహన్ లాల్, మీనాలే ఇందులో కూడా నటించనున్నారు. మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేయనున్నారు. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట.
చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా దృశ్యం సినిమా గుర్తింపు తెచ్చుకుంది. క్రైమ్, థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకేక్కుతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.