Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల చిట్టా పెద్దదే..
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Ram Charan: నిన్న మొన్నటిదాకా కేవలం భారతదేశం వరకే పరిమితమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరిగింది ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "అర్ఆర్ఆర్" సినిమాతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల పేర్లు ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఆస్తుల విలువ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.
మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించిన రామ్ చరణ్ రెండవ సినిమా "మగధీర" తో రికార్డులు సృష్టించారు. ఒకవైపు హీరోగా మరియు నిర్మాతగా మాత్రమే కాకుండా పెప్సీ, టాటాడొకోమో, అపోలో జియో, మోటో క్రాప్, ఫ్రూటీ వంటి 34 ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు రామ్ చరణ్. ఇక చరణ్ మొత్తం ఆస్తుల విలువ 1370 కోట్లు ఉంటుందని అంచనా. రామ్ చరణ్ నెలకి మూడు కోట్ల దాకా సంపాదిస్తున్నారు.
ఇక "అర్ఆర్ఆర్" సినిమా కోసం 45 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్న రామ్ చరణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద బంగ్లాలో నివసిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, వంటి ఎన్నో అధునాతన సదుపాయాలు ఉన్న ఈ బంగ్లా విలువ 38 కోట్లు అని తెలుస్తోంది. ఇక ముంబైలో కూడా ఒక పెద్ద పెంట్ హౌస్ రామ్ చరణ్ పేరు మీద ఉంది. రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ఆస్టిన్ మార్టిన్, మరియు ఫెరారీ వంటి కాస్ట్లీ కారులతో పాటు రామ్ చరణ్ కి సొంతంగా ఒక ప్రైవేటు జెట్ కూడా ఉంది.