కేవలం మేకప్ కోసం కాజల్ అగర్వాల్ ఎంత సేపు కేటాయిస్తుందో తెలుసా?!
* రోజుకి మూడున్నర గంటలు మేకప్ కే గడుపుతున్న స్టార్ హీరోయిన్
కేవలం మేకప్ కోసం కాజల్ అగర్వాల్ ఎంత సేపు కేటాయిస్తుందో తెలుసా?!
Kajal Aggarwal: ప్రేక్షకులు ఎప్పుడు వెండి తెర మీద నటీనటుల కంటే వారి పాత్ర లనే చూడాలి. ఎంత పెద్ద హీరో అయినా హీరోయిన్ అయినా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేస్తేనే ప్రేక్షకుల నుంచి వారికి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఎంత కష్టమైనా పాత్ర అయినప్పటికీ చాలా సులువుగా పోషించగలిగే సత్తా ఉన్న నటీనటులు తక్కువ మందే ఉంటారు. అయితే ఎలాంటి పాత్రనైనా పోషించాలంటే ముందుగా ఆ పాత్రకి తగ్గట్టుగా మేకప్ ఉండాలి. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ మేకప్ వేసుకోవడానికి గంటలు గంటలు పడుతుంది.
ఉదాహరణకి దశావతారం సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పాత్రలను పోషించారు. అందులో ఒక్కో పాత్ర కోసం కమల్ హాసన్ గంటలు గంటలు మేకప్ వేయించుకునేవారు. అదే మేకప్ లో రోజంతా ఉండేవారు. తాజాగా ఇప్పుడు "భారతీయుడు 2" సినిమా కోసం కూడా కమల్ హాసన్ అదే రేంజ్ లో కష్టపడుతున్నారు. 90 ఏళ్ల సేనాపతి పాత్ర కోసం కమల్ హాసన్ రెడీ అవ్వడానికి నాలుగు గంటల సమయం పడుతుందట. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ది కూడా దాదాపు అదే పరిస్థితి అని తెలుస్తోంది.
ఈ సినిమాలో కమల్ హాసన్ భార్య పాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ఒక బామ్మ పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ మేకప్ వేసుకోవడానికి మూడున్నర గంటల సమయం పడుతుందట. ఈ మధ్యనే ఒక బిడ్డకి జన్మనిచ్చిన కాజల్ కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. తాజాగా ఇప్పుడు "భారతీయుడు 2" సినిమాతో మళ్ళీ వెండితెరపై కనిపించనుంది. ఇక ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.