కేసీఆర్ చెప్పిన ఆమాట నాకు గర్వకారణం : కె. విశ్వనాథ్

తన అజ్ఞాత అభిమానిని అని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆ మాట తనకెంతో గర్వకారణం అనీ ప్రసిద్ధ దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు.

Update: 2019-08-11 14:26 GMT

తన అజ్ఞాత అభిమానిని అని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆ మాట తనకెంతో గర్వకారణం అనీ ప్రసిద్ధ దర్శకులు కె.విశ్వనాథ్ అన్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ విశ్వనాథ్ ను అయన ఇంట్లో కలిసి వెళ్ళారు. కేసీఆర్ తనను కలవడంపై విశ్వనాథ్ స్పందించారు. కేసీఆర్ తన కోసం తనింటికి రావడం కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినట్టు ఉందని అయన చెప్పారు.

మర్యాదపూర్వకంగానే కేసీఆర్ తనను కలిశారనీ.. దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదనీ అయన తెలిపారు. తన సినిమాలోని ఓ పాట నచ్చి రాత్రి అయన తనకు ఫోన్ చేసారని చెప్పారు. రేపు వచ్చి కలుస్తానని అన్నారనీ, అందుకే వచ్చి కలిశారనీ చెప్పారు. తామిద్దరి మధ్య సాహిత్యానికి సంబంధించిన చర్చ జరిగిందనీ, చిన్నప్పుడు తాను నేర్చుకున్న ఓ పద్యాన్ని కేసీఆర్ తనకు వినిపించారానీ విశ్వనాథ్ తెలిపారు. తనకు సినిమా తీసే ఓపిక లేదనీ, తాను ఇకపై సినిమాలు తీయలేననీ అయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


Tags:    

Similar News