Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డిలో సాయిపల్లవి అలా మిస్సయ్యారు?: సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న సినిమాల్లో తండేల్ మూవీ ఒకటి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది.

Update: 2025-02-03 09:51 GMT

అర్జున్ రెడ్డిలో సాయిపల్లవి అలా మిస్సయ్యారు?: సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sandeep Reddy Vanga: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న సినిమాల్లో తండేల్ మూవీ ఒకటి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ క్రమంలో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిపల్లవి పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అర్జున్ రెడ్డి సినిమాలో తొలుత సాయిపల్లవిని హీరోయిన్ తీసుకోవాలని అనుకున్న విషయాన్ని ఆయన చెప్పారు. సాయి పల్లవిని ఈ సినిమాలో నటిస్తుందో లేదో తెలుసుకునేందుకు కేరళకు చెందిన కో ఆర్డినేటర్‌కి కాల్ చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అర్జున్ రెడ్డి మూవీ రొమాంటిక్ స్టోరీ అని చెప్పి ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుందా అని అడిగితే ఆ విషయం మర్చిపోండి కనీసం ఆ అమ్మాయి స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదని చెప్పారన్నారు.

చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో పద్ధతిగా ఉంటారని ఆ తర్వాత గ్లామర్ రోల్స్ చేస్తూ ఉంటారని ఆయన అన్నారు. అయితే అవకాశాన్ని, కాలాన్ని బట్టి అందరూ మారినట్టే సాయిపల్లవి కూడా మారుతారనుకున్నానని ఆయన చెప్పారు. కానీ 10 ఏళ్లలో ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. ఆమె చాలా గ్రేట్ అంటూ ప్రశంసించారు. సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా అనగానే ముందుగా గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి. ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, శాలిని పాండే కు మంచి గుర్తింపు వచ్చింది.

సినిమాల ఎంపిక విషయంలో సాయి పల్లవి చాలా సెలక్టివ్‌గా ఉంటారు. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప అంగీకరించరు. అందుకే ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇటీవల ఆమె నటించిన అమరన్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. నాగ చైతన్య, సాయిపల్లవి నటిస్తున్న తండేల్ సినిమా‌పై ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఫిబ్రవరి 7 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News