Harish Shankar : సునీల్ మెయిన్ లీడ్ లో హరీష్ శంకర్ 'వేదాంతం రాఘవయ్య'!
Harish Shankar : షాక్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హరీష్ శంకర్.. ఇక మిరపకాయ్ సినిమాతో హిట్ కొట్టి ఏకంగా
Director harish shankar next film announced with sunil titled as Vedantam Raghavaiah
Harish Shankar : షాక్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హరీష్ శంకర్.. ఇక మిరపకాయ్ సినిమాతో హిట్ కొట్టి ఏకంగా గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు హరీష్.. ఇక గత ఏడాది వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి హిట్ కొట్టిన హరీష్ మళ్ళీ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాని చేసేందుకు కమిట్ అయ్యాడు.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది.
ఇక ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ ప్రస్తుతం ఓ సినిమాకు కథ, మాటలు అందిస్తూ సినిమాని సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ కూడా చేశారు. 'వేదాంతం రాఘవయ్య' అలనాటి సినిమా ప్రముఖుడు పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ కమెడియన్ సునీల్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాని ఫుల్ లేన్త్ ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దగ్గర ఉన్నశిష్యుల్లో ఒకరు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో రానున్నాయి..
ఇక హీరోగా సునీల్ కి సరైనా హిట్ లేకా చాలా రోజులైంది.. దీనితో మళ్ళీ కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సునీల్.. హరీష్ శంకర్ కథతో మళ్ళీ హీరోగా సునీల్ సినిమా వస్తుండడంతో సినిమాపైన మంచి బజ్ ఏర్పడింది.. చూడాలి మరి సునీల్ కి ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతుందో.. ప్రస్తుతం సునీల్ కలర్ ఫోటో అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాతో మరో హాస్య నటుడు సుహాస్ హీరోగా మారుతున్నాడు.