Dil Raju: బాహుబలి నేర్పిన పాఠమే 'కేజీఎఫ్'ను..

* అది చాలా ఎవరు ఊహించనటువంటి బాల్ అని, ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని అన్న దిల్ రాజు

Update: 2022-11-30 14:30 GMT

Dil Raju: బాహుబలి నేర్పిన పాఠమే ‘కేజీఎఫ్’ను..

Dil Raju: ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. డైరెక్టర్లకు కానీ హీరోలకి కానీ సినిమా బడ్జెట్ విషయంలో, షూటింగ్ విషయాల్లో దిల్ రాజు కొన్ని షరతులు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి సినిమాని చూసి కేజిఎఫ్ చాలా నేర్చుకుంది అంటూ దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాహుబలి 1 సినిమా మొదట విడుదలైనప్పుడు నెగిటివ్ టాక్ వచ్చిందని ఆ తర్వాతే పికప్ అయిందని అన్నారు.

ఇక బాహుబలి 1 మరియు 2 రెండు సినిమాలకు కలిపి 600 కోట్ల బడ్జెట్ అయిందని కానీ ఎక్కువ శాతం ప్రాఫిట్ లు బాహుబలి 2 వల్లే వచ్చాయని చెప్పుకొచ్చారు. "కేజిఎఫ్ నిర్మాతలు బాహుబలి నుంచి చాలా నేర్చుకున్నారు. కే జి ఎఫ్ 1 సినిమాకి మినిమం బడ్జెట్ పెట్టుకున్నారు. కానీ మంచి ప్రాఫిట్ లు వచ్చాయి. అలానే కేజిఎఫ్ 2 సినిమాకి కూడా ఎక్కువ ప్రాఫిట్ లు వచ్చాయి. అందరూ కేజీఎఫ్ నిర్మాతలను చూసి నేర్చుకోవాలి. బాహుబలి 1 విషయంలో సమయం మరియు డబ్బులు ఏ విధంగా వాడారు అనేది కేజీఎఫ్ నిర్మాతలు చాలా బాగా అర్థం చేసుకున్నారు," అని అన్నారు దిల్ రాజు.

ఇక ఈ మధ్యనే కన్నడలో సూపర్ హిట్ అయిన "కాంతారా" సినిమా గురించి మాట్లాడుతూ అది చాలా ఎవరు ఊహించనటువంటి బాల్ అని, ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని అన్న దిల్ రాజు "కేవలం పాతిక కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఇంత భారీ ప్రాఫిట్లను అందుకుంటుందని ప్రతిసారి మనం అనుకోలేము. గతంలో నేను నిర్మించిన బొమ్మరిల్లు, ఫిదా, శతమానం భవతి వంటి సినిమాలు కూడా అదే రేంజ్ లో సక్సెస్ ను అందుకున్నాయి," అని అన్నారు.

Tags:    

Similar News