వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబోలో సినిమాలు అలానే ఉంటాయా?

Vamsi Paidipally: డబ్బులు ఖర్చైనా పర్లేదు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటున్నారు

Update: 2022-12-03 06:08 GMT

వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబోలో సినిమాలు అలానే ఉంటాయా?

Vamsi Paidipally: అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి కూడా ఒకరు. తన సినిమా కోసం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్ టెక్నీషియన్ లను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. సినిమా చాలా రిచ్ గా తీయాలని ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు. మరోవైపు అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాలు స్టోరీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కథ, స్క్రీన్ ప్లే వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే సినిమాలు తీస్తారు. భారీ బడ్జెట్ ఉంటేనే సినిమా బాగుంటుంది అని నమ్మని నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. ఇలా విభిన్న ఆలోచనలు ఉన్న దిల్ రాజు మరియు వంశీ పైడిపల్లి కాంబో లో సినిమా ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. గతంలో వీళ్ళిద్దరూ "ఎవడు" మరియు "మహర్షి" సినిమాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల వల్ల ప్రాఫిట్ లు పెద్దగా ఏమీ రాలేదు కానీ బడ్జెట్ మాత్రం రెండిటికి ఎక్కువగానే ఖర్చయింది.

తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబో లో రాబోతున్న "వారసుడు" సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. డబ్బులు ఖర్చైనా పర్లేదు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటూ వంశీ పైడిపల్లి ఈ సినిమాని కూడా చాలా లావిష్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఉదాహరణకు సినిమాలోని "రంజితమే" పాట చూస్తేనే సినిమా కోసం ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు దిల్ రాజు సినిమాలు మీడియం బడ్జెట్ లోనే ఉంటాయి. కానీ ఈ సినిమా కోసం మాత్రం దిల్ రాజు ఎక్కువగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. చాలా వరకు డైరెక్టర్లు బడ్జెట్ ని కొంత తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. ఇక "కాంతారా" వంటి సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా ప్రాఫిట్ లో సంపాదించాయి. వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డైరెక్టర్లు క్వాలిటీ మరియు బడ్జెట్ రెండిటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ వంశీ పైడిపల్లి ఈ కోవలోకి చెందరు. మరి "వారసుడు" సినిమాతో దిల్ రాజు ఎంతవరకు ప్రాఫిట్ లు అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News