ధనుష్‌కు రియల్ లైఫ్ సీత దొరికిందా..? మృణాల్‌తో రిలేషన్ రూమర్స్ హాట్ టాపిక్!
సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ ఆమెకు "సీత"గా ప్రత్యేక అభిమానులున్నారు. అయితే తాజాగా ఆమె పేరు హీరో ధనుష్‌తో జతకడుతూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ధనుష్ – మృణాల్ డేటింగ్‌లో?
కొంతకాలంగా ధనుష్, మృణాల్ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వారు కొన్నిసార్లు కలిసి కనిపించడంతో పాటు పలు ఈవెంట్‌లకు కలిసి హాజరయ్యారు. దీంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారేమోనని అభిమానులు అనుమానిస్తున్నారు.
ధనుష్ ఫ్యామిలీతో మృణాల్ మీట్?
ధనుష్ సోదరీమణులు కార్తిక, విమల గీతను మృణాల్ కలిసినట్లు టాక్. అంతేకాదు, ఆమె ఇప్పటికే వారిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుండడం గమనార్హం. ఓ ఆంగ్ల మీడియా పత్రిక ప్రకారం, ధనుష్ తన కుటుంబ సభ్యులకు మృణాల్‌ని పరిచయం చేశాడట. అయితే ఇప్పటి వరకు ధనుష్ కానీ, మృణాల్ కానీ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఈవెంట్లలో ఇద్దరి క్లోజ్ మోమెంట్స్ వైరల్
‘సన్ ఆఫ్ సర్దార్ 2’ మూవీ ఈవెంట్‌లో ధనుష్, మృణాల్ మధ్య క్లోజ్ మోమెంట్స్ కెమెరాలో బంధించబడ్డాయి. అంతేకాదు, మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో కూడా ధనుష్ హాజరయ్యారు. ఇవన్నీ చూసిన నెటిజన్లు వీళ్లిద్దరూ రిలేషన్‌లోనే ఉన్నారని ఊహించుకుంటున్నారు.
మాజీ భార్యతో విడాకులు
ధనుష్ 2004లో రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ 2022లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, 2024 నవంబర్‌లో అధికారికంగా విడిపోయారు.
ఇప్పుడు మృణాల్ – ధనుష్ ప్రేమకథ నిజమేనా..? లేక ఇదంతా గాసిపేనా..? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం ఈ చర్చే హాట్ టాపిక్!