Dhanush Divorce: వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు.. ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
Aishwaryaa and Dhanush Divorce: స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
Dhanush Divorce: వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు.. ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
Aishwaryaa and Dhanush Divorce: స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి విడాకుల విషయం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ధనుష్ తండ్రి కస్తూరి రాజా విడాకుల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ కస్తూరి రాజా వారు కచ్చితంగా మళ్ళీ కలుస్తారు అని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"భార్య భర్తలు అన్నాక గొడవలు జరగడం సర్వసాధారణం. ధనుష్ ఐశ్వర్య ల మధ్య కూడా అలాంటి గొడవలే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నై లో లేరు. హైదరాబాద్లోనే ఉన్నారు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను. రజనీకాంత్ కూడా విడాకుల విషయాన్ని మరొక సారి ఆలోచించమని వారిని కోరారు. తమ పిల్లల భవిష్యత్తు కోసమైనా వారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు," అని అన్నారు కస్తూరి రాజా. మరి తమ తల్లిదండ్రులు, పిల్లల కోసమైనా ధనుష్, ఐశ్వర్య లు తమ నిర్ణయాన్ని తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.