Deepthi Sunaina: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Deepthi Sunaina: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్
Deepthi Sunaina: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Deepthi Sunaina: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని తేల్చేసింది దీప్తి. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
''ఎంతో ఆలోచించిన తర్వాత నేను, షణ్ముఖ్ పరస్పర అంగీకారంతో ప్రేమ బంధం నుంచి విడిపోయి.. మా దారులు మేము చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్ నిర్ణయం మా మధ్య ఎంతోకాలం నుంచి నడుస్తోంది. ఈక్రమంలోనే మేమిద్దరం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించి.. నిజ జీవితాన్ని విస్మరించాం. మా దారులు వేరని అర్థమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ అండ ఎంతో అవసరం. దయచేసి మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరని కోరుకుంటున్నాం'' అని దీప్తి తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.