Deepika Padukone: రూ. 10 కోట్ల పారితోషికంపై స్పందించిన దీపికా పదుకొణె

Update: 2024-12-01 06:45 GMT

Deepika Padukone remuneration: బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కల్కి 2898 ఏడీ మూవీతో సౌత్‌లో మంచి విజయాన్ని అందుకుందీ బ్యూటీ. ఇక ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. కాగా ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది దీపికా. ఇందులో భాగంగానే ఇటీవల ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

దీపికా త్వరలోనే కల్కి సీక్వెల్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా దీపికా మాట్లాడుతూ.. జీవితం అంటే అనుభవాల సమాహారమని. అందులో కొన్ని చేదుగా ఉంటే, కొన్ని తీపిగా ఉంటాయని చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం.. అమ్మగా తీయనైన అనుభూతిని ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు నటిగా తన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందన్న దీపికా.. అందుకే కొత్త కథలు వింటున్నట్లు తెలిపింది. ‘కల్కి2898ఏడీ’ సినిమా తర్వాత దక్షిణాది నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ.. నా స్థాయికి తగ్గట్టుగా అవి లేవు. అందుకే అంగీకరించలేదని దీపికా చెప్పుకొచ్చింది. ఇక సౌత్‌లో సరైన కథ్ల వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది. తాజాగా తన రెమ్యునరేషన్‌ విషయంలో వచ్చిన పుకార్లపై దీపికా స్పందించింది.

తాను పారితోషికం ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్నానని జరుగుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని దీపికా తెలిపింది. ‘కల్కి 2898ఏడీ’కి తాను రూ. 10 కోట్లు తీసుకున్నానని రాసుకొచ్చారు. అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల వాళ్లకు ఒరిగేదేంటో తనకైతే అర్థం కావడం లేదని దీపికా చెప్పుకొచ్చింది. కథ, పాత్ర నచ్చితే.. రెమ్యునరేషన్‌ గురించి పట్టించుకోనని, ఆ విషయం తన నిర్మాతలందరికీ తెలుసని దీపికా తెలిపింది. 

Tags:    

Similar News