Srikanth Odela: మొదటి సినిమాకే బీఎండబ్ల్యూ కారు..!
Srikanth Odela: మొదటి సినిమాకే బీఎండబ్ల్యూ కారు..!
Srikanth Odela: మొదటి సినిమాకే బీఎండబ్ల్యూ కారు..!
Dasara Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "దసరా" భారీ అంచనాల మధ్య మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. విడుదలకి ముందు నుంచే మంచి హైప్ అందుకున్న ఈ సినిమా విడుదలైన తరువాత కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. డెబ్యూ మూవీ.. దసరాతో .. పాన్ ఇండియన్ రేంజ్ హిట్టు కొట్టారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.
ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ గతంలో పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ' వంటి సినిమాలు చేసినా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు దసరాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందడంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఖరీదైన 'బీఎమ్‌డబ్లూ' కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. కరీంనగర్‌లో జరిగిన దసరా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన అందరి ముందే డైరెక్టర్‌కు కారును ప్రజెంట్ చేశారు.