Abhiram Daggubati: దర్శక నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్న దగ్గుబాటి వారసుడు
Abhiram Daggubati: *దగ్గుబాటి వారసుడిగా అభిరామ్ అతి తొందరలోనే టాలీవుడ్ లో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
Abhiram Daggubati: దర్శక నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్న దగ్గుబాటి వారసుడు
Abhiram Daggubati: దగ్గుబాటి వారసుడిగా అభిరామ్ అతి తొందరలోనే టాలీవుడ్ లో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. "అహింస" అనే ఆసక్తికరమైన టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అభిరామ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది కానీ అభిరామ్ వైఖరి వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది అని, దీనివల్ల దర్శకనిర్మాతలకు ఆలస్యం అయిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే షూటింగ్ సమయంలో అభిరామ్ కాలు బెణికింది. అది కేవలం ఒక్క రోజులో తగ్గిపోయే గాయమే అయినప్పటికీ ఆ సాకు చెప్పి అభిరామ్ షూటింగ్ కి డుమ్మా కొడుతున్నాడట. ఒక వారం రోజులు కాల్షీట్లు ఇస్తే షూటింగ్ పనులు పూర్తి అయిపోతాయి అని కానీ అభిరామ్ మాత్రం దీనికి ఏమాత్రం సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి డైరెక్టర్ తేజ తో పనిచేయడానికి పెద్ద హీరోలు సైతం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన సెట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. తేజ చేతుల్లో దెబ్బలు తిన్న నటులు కూడా ఉన్నారు. కానీ అలాంటి తేజకి అభిరామ్ చుక్కలు చూపిస్తూ ఉండటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.