Anirudh Ravichander: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అనిరుధ్.. ఇక మోత మొదలెడతాడా..!
Anirudh Ravichander: 2023లో బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
Anirudh Ravichander: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అనిరుధ్.. ఇక మోత మొదలెడతాడా..!
Anirudh Ravichander: మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్న వయస్సులోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ధనుష్ 3 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్.. మొదటి పాట వై దిస్ కొలవరితో స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో సంగీత దర్శకుడిగా, సింగర్‌గా ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పుడు మరో 12 సినిమాలు చేతిలో ఉన్నట్టు సమాచారం.
మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ముందుగా తమన్, డీఎస్పీ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు అనిరుధ్ ఆ సీన్ మార్చేశారు. వారికి గట్టి పోటీ ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు. కేవలం కోలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్, టాలీవుడ్‌లో తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ రాక్ స్టార్ వెనకాల అన్ని ఇండస్ట్రీలు పరిగెడుతున్నాయి.
సినిమాల్లో పాటలు మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా తీస్తారనే పేరు అనిరుధ్‌కి ఉంది. ఇటీవల జైలర్, లియో, దేవర సినిమాలలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరినీ కట్టిపడేసింది. సినిమా హిట్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణమనేలా మెప్పించారు అనిరుధ్. దీంతో కొందరు స్టార్ హీరోలు అనిరుధ్ మ్యూజికే కావాలంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీగానే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకీ అవేంటో చూద్దాం.
2023లో బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బాలకృష్ణ అంటేనే బాస్.. అలాంటి బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ తోడైతే బాగుంటుందని మేకర్స్ ఫిక్సైనట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి హిట్ అవ్వడంతో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో రిపీట్ కావాలని కోరుకుంటున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఆ సినిమాకు అనిరుధ్ సంగీతం అనే సరికి బాలయ్య ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలే వరుస హిట్లతో మంచి దూకుడు మీదున్నారు బాలయ్య. మరి బాలకృష్ణ సినిమాకు అనిరుధ్ ఎలాంటి సంగీతాన్ని అందిస్తారో చూడాలి.
మరోవైపు పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి లేదా సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్‌కు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారని టాక్. అనిరుధ్ సంగీతానికి బన్ని డ్యాన్స్‌కు ఇక థియేటర్లలో పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్. మరి అనిరుధ్ తన సంగీతంతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఇవే కాదు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో మరికొన్నిప్రాజెక్టులకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి చిన్న వయస్సులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాడు అనిరుధ్. ఇలాంటి మరెన్నో సినిమాలకు సంగీతం అందించి సక్సెస్ కావాలని కోరుకుందాం.