Saptagiri: రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. పోటీ చేసేది అక్కడి నుంచే..

Saptagiri: సినీ నటుడు సప్తగిరి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు.

Update: 2023-06-12 09:35 GMT

Saptagiri: రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. పోటీ చేసేది అక్కడి నుంచే..

Saptagiri: సినీ నటుడు సప్తగిరి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో నటుడు సప్తగిరి పాల్గొన్నారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

తాను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలోనన్నారు. పేదల కష్టాలు తనకు తెలుసన్నారు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తానని సప్తగిరి అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ లు ఏం ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. టీడీపీ అధికారంలో తెచ్చేందుకు తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధమన్నారు.

Tags:    

Similar News