Colour Photo Movie : ఓటీటీలోకి 'కలర్ ఫోటో'?
Colour Photo Movie : కరోనా వైరస్ వలన ధియేటర్ లు మూతపడడంతో సినిమాలని ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్
Colour Photo Movie
Colour Photo Movie : కరోనా వైరస్ వలన ధియేటర్ లు మూతపడడంతో సినిమాలని ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇప్పటికే టాలీవుడ్ నుంచి కీర్తి సురేష్ మెయిన్ లీడ్ లో వచ్చిన పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, నవీన్ చంద్ర భానుమతి & రామకృష్ణ మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. త్వరలోనే హీరో సూర్య 'ఆకాశం నీ హద్దురా', నాని హీరోగా వచ్చిన 'v' చిత్రాలు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నాయి..
ఇప్పుడు ఇదే బాటలో సుహాస్ హీరోగా వస్తున్న''కలర్ ఫోటో'' చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో హాస్యనటుడుగా నటించి మంచి మార్కులు కొట్టేసిన సుహాస్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు.. ఇందులో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి ఛాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ కమెడియన్ సునీల్ విలన్ గా నటిస్తున్నాడు.. సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించాడు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'హృదయ కాలేయం' సాయి రాజేష్ నిర్మించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'లో విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా పైన నటుడు సునీల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు చెప్పాలి..