Colour Photo: కలర్‌ఫుల్‌గా కలర్ ఫొటో డైరెక్టర్ పెళ్లి

Colour Photo: కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్, ఆ మూవీ హీరోయిన్ చాందిని రావ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Update: 2024-12-07 10:29 GMT

Colour Photo: కలర్‌ఫుల్‌గా కలర్ ఫొటో డైరెక్టర్ పెళ్లి

Colour Photo: కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్, ఆ మూవీ హీరోయిన్ చాందిని రావ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇవాళ తిరుపతిలో వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన చాందిని రావును సందీప్ రాజ్ ప్రేమించారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో నవంబర్ 11న గ్రాండ్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.

సందీప్ రాజ్ ఓ ఇంటివాడు అయ్యాడు. చాందినిని ప్రేమించిన సందీప్ రాజ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు విషెస్ చెబుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు. సందీప్ డైరెక్ట్ చేసిన కలర్ ఫొటోలో చాందిని రావు నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఇక వీరి పెళ్లికి టాలీవుడ్ నటి దివ్య శ్రీపాద, నటుడు వైవా హర్ష, యాంకర్ సుమ కొడుకు రోషన్, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, ఆయన భార్య, అలాగే నటి ప్రియా వడ్లమాని హాజరయ్యారు. కలర్ ఫొటో తీసినప్పటి నుంచి సుహాస్, సందీప్ రాజ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే తన భార్యతో కలిసి సందీప్ రాజ్ వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇక ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి అడుగు పెట్టాడు సందీప్ రాజ్. సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన కలర్ ఫొటో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇటు మ్యూజికల్‌గా.. అటు కమర్షియల్‌గా మంచి హిట్ అందుకుంది. అంతేకాకుండా సందీప్ రాజ్‌కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సుమ కనకాల తనయుడు రోషన్ కనకాలతో మోగ్లీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక చాందిని సినిమాల విషయానికొస్తే.. కలర్ ఫొటో, హెడ్స్ అండ్ టేల్స్‌తో పాటు రణస్థలి, రంగస్థలం సినిమాల్లో నటించింది. ఫేమస్ వెబ్ సిరీస్ పెళ్లి గోల సీజన్ 2లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tags:    

Similar News