Cinematography Act: సినిమాటోగ్రఫీ చట్టం, 1952యాక్ట్‌పై కేంద్రం సవరణలు

Cinematography Act: సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీలో సవరణలు చేయాలనుకున్న కేంద్రం

Update: 2021-07-05 05:53 GMT

సినిమాటోగ్రఫీ (ఫైల్ ఫోటో)

Cinematography Act: సినిమాటోగ్రఫీ చట్టం 1952యాక్ట్‌పై కేంద్రం సవరణలు తీసుకురాబోతోంది. దీంతో సినిమాలపై కత్తెర పెత్తనం కేంద్రం దగ్గర కూడా ఉండనుంది. దీనికి సంబంధించి ఓ ముసాయిదా బిల్లును కేంద్రం రెడీ చేసింది. ఇక్కడే.. ఇదే విషయంలో ఇండస్ట్రీ పెద్దలకు ఎక్కడో కాలుతోంది. మొత్తానికి కేంద్రంపై కత్తులు నూరుతున్న సినీ ఇండస్ట్రీ.., కేంద్రం డిసిషన్‌పై సోషల్‌ మీడియా వేదికగా యుద్ధమే చేస్తోంది.

సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీలో సవరణలు చేయాలని భావించిన కేంద్రం ఆదిశగా సన్నాహలు మొదలుపెట్టింది. అవసరమైతే సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పున:పరిశీలన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేలా చట్ట సవరణ చేస్తూ బిల్లును రూపొందించింది. దీంతో కేంద్ర నిర్ణయం పట్ల యావత్‌ సినీపరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను రక్షించడం కోసం చట్టం ఉండాలి గాని వారి గొంతు నొక్కడం కోసం కాదంటున్నారు ప్రముఖ హీరోలు.

ప్రస్తుతం సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేశాక కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. గతంలో ఇలా జోక్యం చేసుకున్న సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆనిర్ణయాలను తప్పుబట్టింది. కేంద్ర జోక్యం చేసుకోవాలంటే అందుకు తగ్గట్లు చట్టాలు ఉండాలని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది. మరోవైపు చూస్తే.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా సినిమాలు ఉన్నాయనే కారణాలు చెప్పి కేంద్రం పెత్తనం చెలాయించాలని అనుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక బిల్లు అమలులోకి వస్తే సినిమాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని క్రియేటర్లు ఆందోళన చెందుతున్నారు. సృజనాత్మకత పూర్తిగా ఓవైపు ఉంచాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ అలసత్వంపై సినిమాలు తీసినా అవి బయటకు రాకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భావా ప్రకటన స్వేచ్ఛను కేంద్రం కొత్త ముసాయిదా బిల్లు ద్వారా నియంత్రించొచ్చని సినీ ప్రముఖులు ఆవేదన పడుతున్నారు. మొత్తానికి కేంద్రం ఇండస్ట్రీపై పెత్తనం చెలాయించాలని చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

Tags:    

Similar News