CID Season 2: సీఐడీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

CID: ప్రముఖ టీవీ క్రైమ్‌ థ్రిల్లర్‌ షో సీఐడీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా మంది ఈ టీవీషోని ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.

Update: 2025-02-22 05:57 GMT

CID Season 2: సీఐడీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

CID: ప్రముఖ టీవీ క్రైమ్‌ థ్రిల్లర్‌ షో సీఐడీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా మంది ఈ టీవీషోని ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. గత డిసెంబర్‌లో సీఐడీ సీజన్‌ 2 ప్రారంభమైంది. మొదటి సీజన్‌ పూర్తయిన సుమారు 6 ఏళ్ల తర్వాత ఈ కొత్త సీజన్‌ను ప్రారంభించారు. అయితే ఈ కొత్త సీజన్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇప్పటి వరకూ కొత్త సీజన్ లో మొత్తం 18 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌ను మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. శుక్రవారం నుంచి రెండో సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్‌ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చాయి.

'సీఐడీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి కూడా వచ్చింది. సీఐడీ కొత్త సీజన్ అన్ని ఎపిసోడ్లు శుక్రవారం రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి. అంతేకాదు కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్‌ అవుతాయి అని సోషల్‌ మీడియా వేదికగా మేకర్స్‌ పంచుకున్నారు. ఇదిలా ఉంటే నేరాన్ని సీఐడీ టీమ్‌ ఎలా పరిష్కరిస్తుందన్న కథతో సీఐడీని తెరకెక్కించారు. కాగా తోలి సీజన్‌కు వచ్చినంత ప్రజాదరణ, రెండో సీజన్‌కు రాలేదని రివ్యూలు చెబుతున్నాయి. ఈసారి షో ఆశించిన స్థాయిలో లేదని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్‌లో సీఐడీ షోకి వ్యూస్‌ వస్తాయో చూడాలి. 

Tags:    

Similar News