Thangalaan OTT Release: ఓటీటీలోకి వచ్చిన తంగలాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Thangalaan OTT Release: సాధారణంగా థియేటర్లలో హిట్ అయిన సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

Update: 2024-12-10 08:55 GMT

Thangalaan OTT Release: ఓటీటీలోకి వచ్చిన తంగలాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Thangalaan OTT Release: సాధారణంగా థియేటర్లలో హిట్ అయిన సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు నెలరోజులకు వస్తే.. మరికొన్ని రెండు, మూడు నెలల్లోకి వస్తున్నాయి. విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తంగలాన్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా తంగలాన్.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓటీటీ విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో కొన్ని మతాలను కించపరిచేలా ఉన్నాయంటూ తంగలాన్ ను ఓటీటీలో ప్రదర్శనను ఆపేయాలంటూ మద్రాసు కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైనందున ఓటీటీ విషయంలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. ఓటీటీలో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశించింది. దీంతో ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో తాజాగా నెట్ ప్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కథ విషయానికొస్తే.. స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటమే తంగలాన్. వారి పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీగా రూపొందించారు డైరెక్టర్ రంజిత్. అడవిలో ఉండే బంగారు నిధిని వెలికితీయడానికి తంగలాన్ వెళ్తారు. కానీ ఆ నిధికి ఆరతి(మాళవికా మోహనన్) రక్షణగా ఉంటుంది. అసలు ఆరతి ఎవరు..? నిధి కోసం వెళ్లిన తంగలాన్ బృందం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది..? అనేది ఈ కథ. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    

Similar News