ప్రధాని ఇచ్చిన మెగా ఆఫర్‌ను మెగాస్టార్ తిరస్కరించారా..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోడీ ఇచ్చిన సూపర్ ఆఫర్‌ను వదులుకున్నారా..?

Update: 2022-07-08 13:00 GMT

ప్రధాని ఇచ్చిన మెగా ఆఫర్‌ను మెగాస్టార్ తిరస్కరించారా..? 

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోడీ ఇచ్చిన సూపర్ ఆఫర్‌ను వదులుకున్నారా..? తమ అభిమాన హీరో చిరంజీవికి రాష్ట్రపతి కోటాలో ఇచ్చిన కీలక పదవిని చిరు సున్నితంగా తిరస్కరించారా..? మెగా అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలే అయ్యాయా? అంటే అవుననే గుసగుసలు విన్పిస్తున్నాయి. అందరూ అనుకున్నట్లుగానే ప్రధాని మోడీ మెగాస్టార్‌కు ఆ ఆఫర్ ఇచ్చారని ‌అది కీలక పదవే అయినప్పటికీ మెగాస్టార్ దానికి నో చెప్పారనే టాక్స్ లీక్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తనకిచ్చిన ఆఫర్‌ను వద్దనుకున్న తర్వాతే ఆ పదవిని మరొకరికి వరించిందనే వార్తలు బయటకు విన్పిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి వచ్చే గొప్ప ఆఫర్‌ను వదులుకున్నారనే టాక్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ తనను నచ్చిన మెగా హీరో చిరంజీవికి ఏరికోరి రాష్ట్రపతి కోటాలో కీలకమైన రాజ్యసభ పదవిని ఆఫర్‌ ఇచ్చారని కానీ దాన్ని మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే మళ్లీ రాజకీయాల వైపు రావటం ఇష్టంలేని చిరంజీవి ప్రధాని మోడీ ఇచ్చిన రాజ్యసభ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట‌. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతోంది.

నిజానికి మెగాస్టార్ చిరంజీవికి మరోసారి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి అసలే లేదట. ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న మెగా ఆశతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. చివరకు పార్టీని సమర్థవంతంగా నడపలేక తాను అనుకున్న విధంగా ఎన్నికల్లో విజయాలు సాధించలేక చివరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా కొన్నాళ్లపాటు పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇక ఈ జీవితానికి రాజకీయాలు చాలనుకుని పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి మళ్లీ యాక్షన్, స్టార్ట్ అంటూ కెమెరా ముందుకొచ్చారు.

తన జీవితంలో మరోసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టేది లేదని తన సన్నిహితులతో చిరంజీవి సుస్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో యాక్టివ్‌గా లేని చిరు, అన్ని పార్టీల ప్రముఖులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి దూకుడును ప్రదర్శిస్తున్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. సరిగ్గా అలాంటి సమయంలో తాజాగా బీజేపీ నుంచి వచ్చిన రాజ్యసభ మెగా ఆఫర్‌ను చిరు తన చిరునవ్వుతో సున్నితంగా తిరస్కరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన విజ్జప్తిని స్వీకరించాలని బీజేపీ పెద్దలకు కూడా చెప్పినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా రాని పిలుపు మెగాస్టార్ చిరంజీవికి వచ్చింది. ప్రధాని మోడీ హాజరయ్యే ఆ వేడుకలకు హాజరుకావాలంటూ ఆహ్వానం కూడా అందింది. అల్లూరి వేడుకలకు తప్పకుండా హాజరుకావాలంటూ చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా భేటీ అయి ఆంతరంగికంగా మంతనాలు కూడా సాగించారు. అయితే దాని అసలు సారాంశం ఆయనకు రాజ్యసభ పదవి ఆఫరేనని సమాచారం. 

బీజేపీ తరఫున చిరంజీవిని రాజ్యసభకు పంపితే పార్టీ ముద్ర పడుతుందని భావించిన పార్టీ అధిష్టానం రాష్ట్రపతి కోటాలో పంపితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరంజీవి ఎదుట ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే రాజకీయాల జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకున్న చిరంజీవి ఆ ఆఫర్ వెనుకున్న అసలు కారణాలను అర్థంచేసుకుని మెగా ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. రాజ్యసభ ఆఫర్‌ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో తనను కాపులను ఆకర్షించేలా ప్రచారానికి ఉపయోగించుకుంటారని ఊహించే అందుకు చిరంజీవి ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. ‌పైనల్‌గా చిరంజీవి సున్నితంగా తిరస్కరించిన తర్వాతే రాష్ట్రపతి కోటాలో ఎంపీ పదవి విజయేంద్ర ప్రసాద్‌ను వరించినట్లుగా ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తోంది. 

Tags:    

Similar News