Chiranjeevi: త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు.. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
Chiranjeevi: ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలన్న చిరంజీవి
Chiranjeevi: త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు.. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
Chiranjeevi: త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని... ఈ వ్యాఖ్యలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండించాలన్నారు. వక్ర బుద్ధితో వారు కొట్టుమిట్టాడుతున్నారని చిరంజీవి విమర్శించారు. త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలబడతానని చిరంజీవి హామీ ఇచ్చారు.
ప్రముఖ సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఎన్నో సినిమాల్లో రేప్ సీన్స్ లో నటించానని... 'లియో' చిత్రంలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా త్రిషతో రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని భావించానని... కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్సూర్ వ్యాఖ్యలపై పలువురు ఇప్పటికే మండిపడ్డారు.