Chiranjeevi: పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారంటూ చిరంజీవి మంత్రి అంబటికి పరోక్షంగా కౌంటర్..

Chiranjeevi: వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Update: 2023-08-08 05:35 GMT

Chiranjeevi: పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారంటూ చిరంజీవి మంత్రి అంబటికి పరోక్షంగా కౌంటర్.. 

Chiranjeevi: వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు రాష్ట్ర పరిస్థితులను వదిలేసి.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని నేతలకు హితవు పలికారు.

ఇటీవల ఏపీలో బ్రో సినిమా రగడ రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమాపై హాట్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ ప్యాకేజ్ సినిమా రెమ్యునరేషన్ రూపంలో వచ్చిందని ఆరోపించారు. రెమ్యునరేషన్ లెక్కలు తీయాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి స్పందించారు. మీలాంటి పెద్దవాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ఉపాధి అవకాశాల గురించి ఆలోచిస్తే బాగుంటుందన్నారు. ప్రజలకు మంచి చేస్తే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారని.. అది మానేసి సినిమాలపై కామెంట్లు ఎందుకంటూ అంబటికి ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటించారు.

Tags:    

Similar News