Chiranjeevi Birthday Special: చిరు బర్త్‌డే స్పెషల్.. చిరు గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?
Chiranjeevi Birthday Special: చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ప్రతీ ఒక్కరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది.
Chiranjeevi Birthday Special: చిరు బర్త్‌డే స్పెషల్.. చిరు గురించి మీకు ఈ విషయాలు తెలుసా.?
Chiranjeevi Birthday Special: చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ప్రతీ ఒక్కరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. అత్యంత సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలు పెట్టిన చిరంజీవి నెంబర్ 1 హీరోగా ఎదిగారు. కృషి, పట్టుదలతో దేశం గర్వించే స్థాయికి చేరుకున్నారు. నేడు చిరంజీవి పుట్టిన రోజు. ఫ్యాన్స్‌కు పండగరోజు. నేడు చిరు 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
ప్రతీ ఏటా అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే చిరంజీవి ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 22వ తేదీ ఉదయం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలలో పాల్గొంటారు. వేద పండితుల ఆశీర్వచనం అందుకోనున్నారు. కాగా చిరు పుట్టిన రోజును పురస్కరించుకొని ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు రిరీలిజ్ అవుతుండగా.. మరోవైపు కొత్త చిత్రం విశ్వంభర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే సాధారణ మధ్య తరగతి నుంచి మెగాస్టార్ రేంజ్ ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనకాల చిరు కృషి ఎంతో ఉంది. మరి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు.
* చిరంజీవి 150 కి పైగా సినిమాలలో నటించారు. నలభై మూడు సంవత్సరాల తెలుగు సినీ జీవితంలో మూడు నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు, తొమ్మిది సౌత్ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.
* 1987లో చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’ సినిమా రష్యన్ భాషలోకి డబ్ చేశారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికై అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. స్వయంకృషి చిత్రానికి 1988లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తమనటుడి అవార్డుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డును సైతం కైవసం చేసుకున్నారు.
* సినిమా హీరోగానే కాదు బాధ్యతగల పౌరుడిగా సైతం చిరంజీవి ఎప్పుడూ తన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండేలా చూసుకుంటారు. అందుకే 1999-2000 సంవత్సరానికి అత్యధిక ఆదాయపన్ను చెల్లించిన వ్యక్తిగా ప్రభుత్వం నుంచి సమ్మాన్ అవార్డు అందుకున్నారు.
* 1992లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానామొగుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 10 కోట్లకుపైగా రాబట్టింది.
* 1988లో రుద్రవీణ సినిమాలో నటిస్తూ సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులను కైవసం చేసుకుంది.
* ఇక సినిమాలకు కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన చిరు రాజకీయాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి 27-10-2012 నుండి 15-05-2014 వరకు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు సహాయ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.